ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో…

-వడ్లూరి కేశవా చారి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

ప్రభూ!
రోజు నీ పాదాలను కడుగుతున్నాను,
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో.

నా స్వామీ!
నన్ను నీలో చేర్చుకోవూ!
నీ గుండెల నిండా అదుముకోవూ!
నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!!
అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని.
నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ!

యోధుడా!
నీ కళ్ళల్లో కాంతిని చూసాను.
ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం,

చుక్కలన్నీ నీ ముందు తల దించుకోలేదా!
విశ్వ మర్మమెరిగిన నీ నవ్వును చూసాను.
మోనాలిసా నా కళ్ళకు తట్టలేదే!
అది చిత్తరువైతేనేం,
ప్రాపంచిక వాంఛలతో నిండిపాపపు పనులెన్నో చేసిన
అపవిత్రపు చేతులతో నీ బుగ్గలను తాకాను,
అంతే!ఇన్నాళ్ళ నా మోసం,స్వార్థం,ద్వేషం,కుట్ర.
అన్నీ వేళ్ళతో సహా లాగేస్తున్నట్లు
ఒళ్ళు జలదరించిన అనుభవం ఎలా మరిచిపోగలను.

వీరుడా!
భయపడొద్దంటావ్.
గురువా!
బాధ్యతలన్నినా పైనే వేస్తావ్.
నిత్య ప్రేరకా!
నను నిరంతరం మేల్కొలుపుతుంటావ్.
యోగీ!
ధ్యానమే నీ జీవనయానమంటావ్.
మౌనీ!
నిశ్శబ్దమే బంగారమంటావ్.

వేలకోట్ల సంవత్సరాల నా సంస్కృతి శక్తులు
మూర్తీభవించిన సంపూర్ణ భారత యువకా!
నీవు నాడు దేశదేశాల్లోనాటిన నా భారత కీర్తి పతాక
నేటికీ విశ్వ వినీలాకాశంలోగర్వంగా రెపరెపలాడుతూనే వుంది.

విశ్వ మతాల సారాన్ని గ్రహించి,
దివ్యతేజస్సుతో ప్రకాశించిన ప్రవర్తకా!
నీవు నాడు ప్రతి భారత యువకుని గుండెల్లోనింపిన అమృత సందేశాలు
నేటికీ కడలి తరంగాలై అనునిత్యం ఘోషిస్తూనే వున్నాయి.

మహాత్మా! మహితాత్మా!!
వ్యక్తీ!శక్తీ!!
నరేంద్రుడా! వివేకానందుడా!!
మళ్ళీ రావా!
నా సంస్కృతి గొప్పదనాన్నిఈ విశ్వ జనులందరికీ చాటడానికి.
మళ్ళీ రావా!
నా సంస్కృతి వృక్షాన్నిఈ చెదలు బారినుండి రక్షించడానికి.

అందుకే నా దైవమా!
రోజు నీ పాదాలను కడుగుతున్నాను
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో.

3 స్పందనలు నుండి “ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో…” కు


  1. 1 ప్రజాపతి అద్దంకి 1:02 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 17, 2007

    కేశవ్ తమ్ముడు మామూలుగా చించావ్.నీలో ఇంత మంచి కవి,కంప్యూటర్ వీరుడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది.

  2. 2 మద్దిరాల సిద్దార్ధ 1:19 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 22, 2007

    కేశవ్‌ అన్నయ్యా ! నీ కవిత చాలా బాగుంది. కాదు, చాలా చాలా బాగుంది నీలోని కవితా మాధుర్యం .
    కంప్యూటర్ పరిజ్ఞానం నాకు నచ్చింది.

  3. 3 seethapathi 3:57 పూర్వాహ్నం వద్ద నవంబరు 21, 2007

    kesav!, what a wonder with imtional touch of art, and do the best.All the best


ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

a

 

ఫిబ్రవరి 2007
సో మం బు గు శు
    మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

మా పాఠకులు