సమకాలీన సాహిత్యాన్ని ఇంటర్నెట్ పాఠకులకు అందుబాటులోకి తేవాలన్న మా ప్రయత్నం ఈనాటికి ఫలించింది. ఈ సాహిత్య వేదిక సాహితీ వేత్తల, సాహిత్య విద్యార్థుల , సాహితీ ప్రియుల అభిప్రాయాలు, వారి భావాల ప్రకటనకు ఒక వాహికగా కొనసాగుతుంది. ‘తెలుగు సాహిత్య వేదిక’ త్వరలోనే మరిన్ని శీర్షికలతో మరింత సాహిత్యాన్ని మీకు అందజేయనుంది.
ఈ సంచికలో ప్రచురించటానికని అడిగిన వెంటనే తమ రచనలనిచ్చిన ఆచార్య శరత్‌జ్యోత్స్నా రాణిగారికీ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికీ, ముందు నుంచీ మాకు సహాయ సహకారాలను అందజేస్తూనే, ఈ పత్రికలో ‘తొలి తెలుగు అడుగులు‘ అనే శీర్షికను నిర్వహించటానికి అంగీకరించిన డా. దార్ల వెంకటేశ్వర రావు గారికీ మా కృతజ్ఞతలు.
ఈ తెలుగు సాహిత్య వేదిక విజయవంతంగా మీ ముందుకు రావటానికి సహకరించి వారందరికీ మా కృతజ్ఞతలు.

పాఠకుల అభిప్రాయాలు