సమకాలీన సాహిత్యాన్ని ఇంటర్నెట్ పాఠకులకు అందుబాటులోకి తేవాలన్న మా ప్రయత్నం ఈనాటికి ఫలించింది. ఈ సాహిత్య వేదిక సాహితీ వేత్తల, సాహిత్య విద్యార్థుల , సాహితీ ప్రియుల అభిప్రాయాలు, వారి భావాల ప్రకటనకు ఒక వాహికగా కొనసాగుతుంది. ‘తెలుగు సాహిత్య వేదిక’ త్వరలోనే మరిన్ని శీర్షికలతో మరింత సాహిత్యాన్ని మీకు అందజేయనుంది.
ఈ సంచికలో ప్రచురించటానికని అడిగిన వెంటనే తమ రచనలనిచ్చిన ఆచార్య శరత్‌జ్యోత్స్నా రాణిగారికీ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికీ, ముందు నుంచీ మాకు సహాయ సహకారాలను అందజేస్తూనే, ఈ పత్రికలో ‘తొలి తెలుగు అడుగులు‘ అనే శీర్షికను నిర్వహించటానికి అంగీకరించిన డా. దార్ల వెంకటేశ్వర రావు గారికీ మా కృతజ్ఞతలు.
ఈ తెలుగు సాహిత్య వేదిక విజయవంతంగా మీ ముందుకు రావటానికి సహకరించి వారందరికీ మా కృతజ్ఞతలు.

మీ ప్రయత్నం చాలా బాగుంది
కేటగిరీలు మరీ ఒకటే పెట్టకుండా కొన్ని ఎక్కువ పెట్టండి
ఉదాహరణకు ప్రతి దానికీ “తెలుగు” అని, Telugu అని ఇంకా కవితలకు అమ్మ అని ఇతర కేటగిరీలు కూడా పెట్టండి. తరువాత తరువాత చాలా పనికి వస్తాయి.
ఇంటర్నెట్టులో వెతికే వారికి కూడా బాగుంటాయి
తెలుగు సాహిత్య వేదిక ఈ-మ్యాగజైన్ ప్రారంభమయింది నిన్ననే అయినా ఇంత తక్కువ వ్యవధిలో విశేష ఆదరణ పొందడం సంతోషించదగ్గ విషయం. మునుముందు ఇలానే మంచి రచనలు అందించి పాఠకుల ఆదరాభిమానానాలను పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని ఇంత ఆకర్షణీయంగా తీర్చి దిద్దడానికి చొరవ తీసుకున్న వారందరికీ నా అభినందనలు.
http://zillagrandhalayam.wordpress.com/2007/02/18/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%b5%e0%b0%b2%e0%b1%86%e0%b0%a8%e0%b1%81/
దయచేసి సహకరించగలరు…