భారతీ స్తుతి!

- ఓం ప్రకాశ్, ఎం., (ఎం.ఫిల్),

ఉస్మానియా విశ్వవిద్యాలయం.

వ్యాసపుర పీఠవాసవు

భాసుర వీణాక్షదామ పాణివి వాణీ!

వ్యాసమునీశ్వర సేవిత

దాసుడ ననుయేలరమ్ము దయతో దేవీ!

 

బాసర పుణ్యతీర్థమున భాసిలి, భక్త జనావళీ మనో

వాసినియై, వచోవిభవ భావ విజృంభిత దివ్య మూర్తయై,

హాసవిలాస దీవరదయై, కవితారచనాత్మరూపయై,

వ్యాస మహామునీశకృతయై వెలుగొందెడి వాణి వేడెదన్!

 

బాసర పీఠమున్ వెలిగి భక్తుల పాలిటి కల్పవల్లియై,

దోసములన్నిటిన్ దునిచి, దోర్బల ధీబల దాత్రివంచు, నీ

బాసట వీడకన్ హృదయ పద్మమునందున గొల్తునమ్మ, యో

సారసనేత్రి! నీ కరుణశారద చంద్రికలౌత భారతీ!!

1 ప్రతిస్పందన నుండి “భారతీ స్తుతి!” కు


  1. 1 Sri Raghava Kiran Mukku 6:38 పూర్వాహ్నం వద్ద మార్చి 17, 2007

    ఉ. పక్కులు పల్కురీతి నిటు బాసరవాసిని శారదాంబపై
    చక్కని పద్యమాలికలు చప్పున చెప్పి విశేష భక్తితో
    మ్రొక్కెడు భక్తసత్కవికి మోదము తోడ ప్రశంస జేసెదన్ -
    ఎక్కడ నాయనా యిపుడు తెల్గులొ వ్రాసిన పద్యసూనముల్
    ఎక్కడయంచు వేచి గన చేవను (చేతల) చూపెను ఓం ప్రకాశుడే.

    తెలుగు వ్రాయటం చదవటం మాట్లాడటం సరిగా వచ్చినవారే కనుమరుగౌతున్న యీ తరుణంలో చక్కగా పద్యప్రసూనపూజ చేసిన ఓం ప్రకాశ్ గార్కి రాఘవ నమస్సులు.


ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

a

 

ఫిబ్రవరి 2007
సో మం బు గు శు
    మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

మా పాఠకులు