తెలుగు సాహిత్య వేదిక పాఠకులకి నమస్కారం!
సాహిత్య వేదిక పూర్తిగా విద్యార్థులచే నిర్వహించబడుతున్న పత్రిక అని మీకు తెలిసిందే. అయితే ఇన్నాళ్ళూ స్నాతకోత్తర విద్యార్థులు సెమిస్టరు పరీక్షలు, ప్రవేశ పరీక్షల హడావుడిలోనూ, పరిశోధక విద్యార్థులు తమ తమ సిద్ధాంత గ్రంథాల సమర్పణల కార్యక్రమాల్లోనూ పడిపోయారు. ఈ అవాంతరాల కారణంగా పత్రిక దాదాపుగా రెండు నెలలు విరామం తీసుకోవాల్సి వచ్చింది.
ఈ అనుభవాల దృష్ట్యా, ఇకముందు ఏ కారణం చేత కూడా పత్రిక ఆగిపోకుండా ఉండేందుకు సరైన ప్రణాళిక, వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నాం. “తెలుగు సాహిత్య వేదిక” ఇక పూర్తి స్థాయిలో, త్వరలోనే మళ్ళీ మీ ముందుకు రాబోతున్నది. పాఠకులు మరి కొద్ది రోజులు వేచి చూడవలిసిందిగా కోరుతున్నాం.

పాఠకుల అభిప్రాయాలు