ఆగష్టు, 2007ను భద్రపఱచు

తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్య వేదిక పాఠకులకి 60వ స్వాంతత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అవని ప్రేమ

 డా//అద్దంకి శ్రీనివాస్
హైదరాబాదు విశ్వవిద్యాలయం

గుండె ఒక్కసారిగా తడిసి ముద్దవుతుంది.
వంటి మీద వెంట్రుకలకి కూడా దేశభక్తి ఉందేమో
దేశం పేరు చెప్పగానే నిక్కపొడుచుకొని మరీ
వందనాలర్పిస్తున్నాయి. చదవుట కొనసాగించు ‘అవని ప్రేమ’

అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ

డా//దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

తొమ్మిది నెలలు నిండక ముందే
ప్రపంచంలోపడిన సంబరంతో
సంకని సంచి తగిలించిన మరుక్షణమే
నా చేతిలో…
పిచ్చుకకు రాబందు రెక్కలొచ్చిన సమాచారం
నమ్మకం నరకబడుతున్నట్లు
నీకు రెక్కలెలా వచ్చాయి
చందమామని వదలి ఉండలేనని
ఒట్టేసుకున్న వెన్నెల చదవుట కొనసాగించు ‘అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ’

భరతమాత

అండెం శ్రీనివాస్ రెడ్డి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

సీ: పరదేశ సంస్కృతుల్ పసి మొగ్గవలె నుండ 
             పువ్వువైతివి నీవు పుట్టగానె 
     గంగవాణి సిందుత్తుంగ తరంగాన
             తొంగి చూస్తివి నీవు తొల్లినాట 
     అజ్ఞాన తామసిన్ అణచివేస్తివి నీవు
             వేదకిరణముల వెలికి తీసి చదవుట కొనసాగించు ‘భరతమాత’

నాదు జాతి నాదు దేశము నాదు భాష

డా// అద్దంకి శ్రీనివాస్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

        ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.

         జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకుపోయేలా సృజన చేశారు. ఈ స్పృహ తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలం నుండే వచ్చింది. అంతకు ముందు సాహిత్యంలో ఈ స్పృహ ఉన్నప్పటికీ దాని లక్ష్యం, పరిధి వేరు. గురజాడ అప్పారావుగారి దేశభక్తి గేయం మొదలుకొని ఈ అభిమాన త్రయాన్ని బోధించే సాహిత్యమంతా ఒక ఉద్యమ స్ఫూర్తితో, చైతన్య దీప్తితో, సంస్కరణాత్మకమూ, ప్రబోధాత్మకమూ అయిన గమ్యం వైపే సాగింది. ఈ నేపథ్యం గల సాహిత్యంలో రాయప్రోలు వారు చెప్పిన మూడు అభిమానాలను స్పృశించడమే ఈ వ్యాసోద్దేశ్యం. చదవుట కొనసాగించు ‘నాదు జాతి నాదు దేశము నాదు భాష’

నాదు జాతి నాదు దేశము నాదు భాష -2

కవి, సమాజం ఎన్నటికీ వేరు కాదు. రాసేది ధనుర్భంగమనే అంశమే అయినా, నాడు తన చుట్టూ ఉన్న ఉద్యమ స్ఫూర్తి కరుణశ్రీ ‘ఉదయశ్రీ’ కావ్యంలో ఎంత చక్కగా ధ్వనింపజేశాడో చూడండి.
“చెల్లరే విల్లువవిరుచునే నల్లవాడు
పది పదారేండ్లయెల రాచ పడుచువాడు
సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు
కనులు గుట్టిన తెల్ల మొగాల వారు”
“’నల్లవాడను’ పదమును భారతజాతీయ వీరునికి ‘తెల్లమొగాల వార’న్న పదమును ఇంగ్లీషు దొరలకు సంకేతముగా గ్రహింపవచ్చున”ని సినారె అభిప్రాయపడ్డారు. చదవుట కొనసాగించు ‘నాదు జాతి నాదు దేశము నాదు భాష -2′

ప్రపంచ మాండలీకం – గ్లోబిష్!

డా//పమ్మి పవన్ కుమార్
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

     రకరకాల ఆధిపత్యాల నుంచి ఒక్క ఉదుటున బయటపడగలిగే తారకమంత్రం  ఏదీ మన దగ్గర లేదిప్పిడు. వ్యక్తిగానైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం పనిచేస్తుంది. ఆధిపత్యం బలవత్తరమయినప్పుడు వ్యక్తులు, వ్యవస్థలు దాని వెంటబడిపోవడం సహజం. కాలక్రమంలో అదెంతటి తిరోగమన శక్తిగా పనిచేయగలదన్న తర్కానికి ఇక్కడ తావు లేదు. మనుగడ కోసం పోరాటంలో అంతా సహజంగానే కనిపిస్తుంది. భావ ప్రసారానికి, భావ గ్రహణానికి వాహికగా  ఉండే భాషల విషయంలోనూ ఇదే జరగబోతుందా? అవుననే అంటున్నారు గ్లోబిష్ ఉదంతం తెలిసిన వారంతా! చదవుట కొనసాగించు ‘ప్రపంచ మాండలీకం – గ్లోబిష్!’

శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికా విశేషాలు

                                                                           - చాగం కొండారెడ్డి

హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

          కవి సమ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారి సర్వ సాహిత్య సృష్టిలో శిఖరాయమానమైన రచన శ్రీమద్రామాయణ కల్ప వృక్షం. ఈ కావ్యావతారికలో డెబ్బై అయిదు పద్యాలు, వచనాలు ఉన్నాయి. నన్నయ కాలం నుండి కావ్యానికి ప్రారంభంలో అవతారికను రచించటం కవుల సంప్రదాయమైంది. అవతారికలో కృత్యాద్యవస్థ (కృతి+ఆది+అవస్థ) కనిపిస్తుంది. ఒక కావ్య రచనకు పూర్వం ఆ కవి మానసిక స్థితిని తెలియజేసేదే కృత్యాద్యవస్థ. ఈ దృష్టితో తెలుగు కావ్యావతారికలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. చదవుట కొనసాగించు ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికా విశేషాలు’

నెత్తురింక ఆరలేదు

పసునూరి రవీందర్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

ఈ భూమి సల్లగుండ
కాసిన్ని చినుకులో…
కాసింత నెత్తురో…
తాకితే చాలు…,
వృక్షాలకో,  వీరులకో జన్మనిస్తుంది. చదవుట కొనసాగించు ‘నెత్తురింక ఆరలేదు’

మాట్లాడే మౌనం

బెల్లంకొండ రవికాంత్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

మాటలంటే నిశ్శబ్ద నదిపై కట్టిన
అనుభవాల వంతెన కదా…!
మాటలంటే అప్పుడే వచ్చిన మొగ్గను చూస్తూ
తల్లి చెట్టు కనే చిగురు కలే కదా…!!
మాటలంటే మౌనం ముఖం పైన
పెదవులు రాసిన అందమైన ప్రేమ లేఖే కదా…!!!
* * * చదవుట కొనసాగించు ‘మాట్లాడే మౌనం’

ఆంధ్రమాత

చాకలకొండ రమాకాంతరావు
Cincinnati, OH USA. 

పల్లవి: ఆంధ్ర మాత కన్నబిడ్డలం 
        అందరిలో మేము మిన్నలం

అ.పల్లవి: పొందికగా అందరము పాలు నీరు లాగ కలిసి
          ముందు కొకటై సాగిపోదము.

చరణం: తరతరాల సంప్రదాయ సోయగాలే ఆస్తులుగా
         తరగని మా మూలధనం తెలుగు ధనం, సంస్కృతిగా
         చెరగని మా త్యాగ బలం సిరి, సంపద సొమ్ములుగా
         వీర నారి, నవయువకులు వెల్లువగా వేగంగా చదవుట కొనసాగించు ‘ఆంధ్రమాత’


Telugutalli_image

a

 

ఆగష్టు 2007
సో మం బు గు శు
« జూన్   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

మా పాఠకులు