అవని ప్రేమ

 డా//అద్దంకి శ్రీనివాస్
హైదరాబాదు విశ్వవిద్యాలయం

గుండె ఒక్కసారిగా తడిసి ముద్దవుతుంది.
వంటి మీద వెంట్రుకలకి కూడా దేశభక్తి ఉందేమో
దేశం పేరు చెప్పగానే నిక్కపొడుచుకొని మరీ
వందనాలర్పిస్తున్నాయి.
కళ్ళు రెండూ కన్నీటి బిందువులవుతున్నాయి.
జెండాకర్ర పతాకని మోస్తున్నట్లు
కన్నీటి చారిక బుగ్గపై నిలబడి కళ్ళని మోస్తూ
రెప్పల ముడిలాగినప్పుడల్లా
అశ్రు బిందువుల్ని పువ్వుల్లా జలజలా రాలుస్తున్నాయి.
నిన్న – నన్ను ధన్య జీవిలా నిలబెట్టిన ఈ నేల
తమ స్వేద బిందువులతో స్వాతంత్ర్యపు పాదుల్ని
తడిపిన త్యాగధనుల్ని కన్న ఈ నేల
నాదేనన్న భావం రాగానే శరీరం మొత్తం
ప్రకంపనల పరవళ్ళతో పులకరించిపోతుంది.
దేశంలోని మట్టి మొత్తాన్ని
నలుగు పిండిలా పులుముకోవాలన్నదే తపన.
ప్రకృతి మొత్తాన్ని గాఢ పరిష్వంగం చేసి
గుండెల్లో నిలుపుకోవాలన్నదే ఆవేశం.
అవని ప్రేమ అణువణువునా పులకరించడం కన్నా
ఒక భారతీయునికి ఇంకేం కావాలి.

5 స్పందనలు నుండి “అవని ప్రేమ” కు


  1. 1 sarath 7:32 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 16, 2007

    జెండా వందనం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మనసూ పులకరిస్తుంది. అదొక మంచి అనుభూతి. ఆ అనుభూతిని వర్ణించిన మీ కవిత చాలా బాగుంది.

  2. 3 Ramu 10:28 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 18, 2007

    మీ కవిత చాలా బాగుంది. దేశ భక్తిని ప్రేరేపించే విధంగా వుంది.

  3. 4 seethapathi rao 5:34 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 20, 2007

    కవిత చాలా బాగుంది.పాటలా రాస్తే ఇంకా బాగుండేది.

  4. 5 Ramu 6:29 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 20, 2007

    ఈ కవిత నాకు చాలా నచ్చింది.


ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

a

 

ఆగష్టు 2007
సో మం బు గు శు
« జూన్   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

మా పాఠకులు