ఆంధ్రమాత

చాకలకొండ రమాకాంతరావు
Cincinnati, OH USA. 

పల్లవి: ఆంధ్ర మాత కన్నబిడ్డలం 
        అందరిలో మేము మిన్నలం

అ.పల్లవి: పొందికగా అందరము పాలు నీరు లాగ కలిసి
          ముందు కొకటై సాగిపోదము.

చరణం: తరతరాల సంప్రదాయ సోయగాలే ఆస్తులుగా
         తరగని మా మూలధనం తెలుగు ధనం, సంస్కృతిగా
         చెరగని మా త్యాగ బలం సిరి, సంపద సొమ్ములుగా
         వీర నారి, నవయువకులు వెల్లువగా వేగంగా
         వారసత్వ పౌరషమే వరలొలుక తరలుదాం.
                                            “ఆంధ్రమాత” 

చరణం: టంగుటూరి కేసరులకు, పాముల నరసింగాలకు
          సింగపు సాహసంబిడ్డడు సీతా రామరాజులకు
          నింగినంటు కీర్తిగల కందుకూరి, గురజాడకు
          పొంగిపోవు త్యాగ బుద్ధి విశ్వనాథ కర్ణులకు
          పొంగారి కన్న తల్లి పుణ్యభూమి ఇది అందాం.
                                              “ఆంధ్రమాత”  

చరణం: కాయ కష్టం చేసి పొలములను పండిద్దాం.
         హేయమున పనులేవి లేవన్నది చాటిద్దాం.
         చేయి చేయి కలుపుకొని చెలిమి తోటి జీవిద్దాం.
         తీయనైన ఆనందం తనివితీర పొందుదాం.
         హాయిలోన ఆంధ్రావనికనుహారం లేదందాం.

0 స్పందనలు నుండి “ఆంధ్రమాత” కు



  1. ఇంకా వ్యాఖ్యలు లేవు

ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

a

 

ఆగష్టు 2007
సో మం బు గు శు
« జూన్   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

మా పాఠకులు