అండెం శ్రీనివాస్ రెడ్డి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
సీ: పరదేశ సంస్కృతుల్ పసి మొగ్గవలె నుండ
పువ్వువైతివి నీవు పుట్టగానె
గంగవాణి సిందుత్తుంగ తరంగాన
తొంగి చూస్తివి నీవు తొల్లినాట
అజ్ఞాన తామసిన్ అణచివేస్తివి నీవు
వేదకిరణముల వెలికి తీసి
శాంతి అహింసల సందేశములనిచ్చి
జీవితం కర్థము చెప్పినావు
ఆ.వె: ధీర వీర శూర తేజోవిరాజుల
గన్న నీ చరితము కలికితమ్ము
విశ్వమదిరి పడగ వేనోళ్ళ పొగడెద
బహువిధముగ నిన్ను భరతమాత
సీ: మంచు కొండయు నీకు మణికిరీటముగాను
భాసించె శిరమున భరతమాత
మణికిరీటపు కాంతి మహాసాగరమైన
సింధు నదిగమారి సిందులేసె
గంగయమున నదుల్ కంఠాభరణముగ
మెడలో జిగెల్ మని మెరయుచుండె
భాసించె నడుమున వడ్డాణమువలెను
తపతి మహానర్మదాది నదులు
తే.గీ: తుంగ గోదారి కృష్ణలుత్తుంగ యలలు
పాదములకును యందెలై పాటపాడె
పెన్న కావేరి నదులేమొ మెల్లగాను
కడిగి వెళ్ళుచునుండెను కాళ్ళధూళి

ఈ వయసునుండే పద్యాలు రాయడం, అదీ మంచి భావాలతో రాయడం ఉత్తమ సంస్కారాన్ని అభివృద్ధి చేస్తుంది. దీన్ని కొనసాగించండి.
marpu prakruti dharmam
alala thakidiki shilale maarutay
atuvantapudu
manushulam manam maarakapote ela brother
మీ పద్య రచన చాలా బాగుంది.
శ్రీనివాస్ రెడ్డిగారూ! మీ పద్యాలు బాగున్నాయి. ప్రజల గుండెల్లో భారతీయ అమృత మకరందాన్ని నింపుతున్నాయి.
పద్యం చాలా అందంగా కుదిరింది. నదులని ఆభరణాలుగా, పాద ధూళి కడిగే అలలుగా బాగా రాసారు..