అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ

డా//దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

తొమ్మిది నెలలు నిండక ముందే
ప్రపంచంలోపడిన సంబరంతో
సంకని సంచి తగిలించిన మరుక్షణమే
నా చేతిలో…
పిచ్చుకకు రాబందు రెక్కలొచ్చిన సమాచారం
నమ్మకం నరకబడుతున్నట్లు
నీకు రెక్కలెలా వచ్చాయి
చందమామని వదలి ఉండలేనని
ఒట్టేసుకున్న వెన్నెల
ఏ సూర్య కిరణస్నానంలోనో వెలిసిపోయి 
శుక్లపక్షాన్నంతా కృష్ణపక్షానికిచ్చేసిందో
చంద్రునికింక ప్రతిరాత్రీ కాళరాత్రే!
వెన్నెల్ని పున్నమిరాత్రుల్నీ చేసి విహరించటం
పచ్చని బీడుల్లో జల్లులన్నీ తొలకరి చినుకులుగా
మార్చుకొని గంతులేయటం
కాగితాల పడవల్లో కలల్ని సాగనంపటం  
నీ అందెల రవళే నా ఓంకారనాదసుప్రభాతాలుగా విన్నక్షణాలు…
ఇక ఇవన్నీ
హృదయ పేటిక చివరి అరలో చాచుకున్న
చిన్ననాటి ఫోటోలయిపోవలసిందేనా?
ఏమని చెప్పనీ పిచ్చి చకోరపక్షికి?
కాగడాలు ఆరిపోకుండా
చమురు తేవటానికే
ఆఘమేఘాలమీద ఆ దేశానికి పోయావని చెప్పనా?
అదేమీ కాదు… అల్లుకొనే లతకీ
ఎన్నాళ్ళకీ పందిరి కాలేకపోయిన
అసమర్థుడిపట్ల అసహనమని చెప్పనా?
కాదు కాదు…
నీకామ మోక్ష ధర్మంఇప్పుడిప్పుడే
అర్థమవుతుంది
పవిత్రప్రేమను కూడా
అంతర్జాతీయ మార్కెట్
ఏ బలహీనతతోనో లోబరిచేసుకుంది కదూ! 
నువ్వు నుదుటి మీద కుంకమ బొట్టుపెట్టుకొనేటప్పుడు
అద్దంలో చూసుకోవద్దు
అధరామృత స్మృతి
విషబిందువై తాకిన తొలగని మచ్చేదో గుర్తొస్తుంది!

మూతబడని ఈ మూగదృశ్యాన్ని
తొలివేదనకే రాలిన మూత్యాల గుసగుసల్ని
ఏనాడైనాఇంటర్ నెట్ నుంచైనా తీసుకొని ధరించే వీలుందా?
పోన్లే…
కనీసం పోయేముందైనా
నీకనుకొలికి కోటి కాంతుల్లో
ఓ కిరణాన్నైనా విదల్చలేకపోయావా
దానితోనేపవిత్ర సైనైడ్ కౌగిలిలో మిగిలిపోయుండేవాడ్ని!!

3 స్పందనలు నుండి “అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ” కు


  1. 2 venkatesh 8:03 అపరాహ్నం వద్ద ఆగష్టు 24, 2007

    SIR,

    MEE KAVITHALO PRAPAMCHIKARANA PRABAVAMTHO MAARUTUNNA MAANAVULA MANDYA
    VUNDE SAHAJA PREMA ELA KUCHINCHUKONI POTUNDO CHAKKAGA VIVARINCHARU.

    INTHA MANCHI KAVITHA CHADIVI NANDUKU SANTHOSHANGA UNDI.

    E.VENKATESH

  2. 3 Ramu.k 7:05 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 24, 2007

    me kavitaha chalabagundi. prapanchamloni vasthava sngatanlaki kavithale nidarshanam. e vishwa gamanani chusthe pavithra preemanu kuda marketlo Aamamutharemonani bayam vesthundi


ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

a

 

ఆగష్టు 2007
సో మం బు గు శు
« జూన్   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

మా పాఠకులు