పసునూరి రవీందర్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
ఈ భూమి సల్లగుండ
కాసిన్ని చినుకులో…
కాసింత నెత్తురో…
తాకితే చాలు…,
వృక్షాలకో, వీరులకో జన్మనిస్తుంది.
ఈ మట్టికి
రక్తాభిషేకం
జరిగిందెప్పుడో
సరిగ్గా గుర్తులేదు కానీ,
ఆ తడి ఆరకుండ
వీరులకు బలిదానాలు జరుగుతూనే ఉన్నాయ్
ఆ వీరులంత ఎవరని…?
సంస్థానాల రక్షణకో
సొంత ఆస్తుల పరిరక్షణకో
ఎదురొడ్డొ నేలకొరిగినోళ్ళు కాదు.
స్వేచ్ఛా వాయువుల కోసమో,
వెట్టి పిశాచి అంతం కోసమో,
కాదంటే విద్యుత్ చార్జీల తగ్గింపు కోసమో,
లేదా జానెడు జాగ కోసమో
వాళ్ళంత గుండెను జెండా చేసినోళ్ళు
ఓనా ముదిగొండ
పోరుతల్లి ముద్దుబిడ్డా!
నీవు రాజ్యహింసకు
బలైన రామచిలుకవు కాదు,
కొత్త ఊపిరి
కూడగట్టుకున్న
పోరు మొలకవు.

super
MEE KAVITHALO ARDATHA UNDI.ANTHAKU MINCHI CHAKKANI SHYLI THO
RASTUNNARU.MUDIGONDA MEEDA NENU CHADIVINA KAVITHALO IDI NAAKU CHALA
NACHINDI.
E.VENKATESH
thepoem is simply superb
and
the last words
baliaina raamachilakavu kaadu
poru molakavu
was very very genitick
మీ కవిత చాలా బాగుంది.
యెత్తుగడ బాగుంది.ముగింపు హెలెట్.వీరుల జననం బాగుంది.