డాలర్ ప్రేమల నడుమ…

— పసునూరి రవీందర్, (పిహెచ్.డి.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

యవ్వనం మోసుకొచ్చిన
రాగాలాపనలకు
రూపమిచ్చి ఉక్కిరి బిక్కిరి కమ్మంటావు.

ఫీలింగ్స్ లేవని ఫీలవుతావు.

సినిమాలో లాగ బతకాలని
నా చెవుల్లో ఒక ఎడతెగని చాటింపు వేస్తావు.

క్షమించు ప్రియా…
ఈ అసమర్థ ప్రేమికున్ని!

నీ పెదాల మీద డాలర్ నవ్వుల్ని పూయించలేను.
అమెరికా కలల్ని అందంగా నీకందివ్వలేను.
జీవితాల్ని మార్చే ఒకే ఒక్క ‘ఐడియా’ను కొనివ్వలేను.
నెట్‌వర్క్ కుక్కపిల్లలా నీ వెంట తిరగలేను.

ప్రియా!
అల్సర్‌తో బాధపడే నాకు
పల్సర్ షికార్లు సాధ్యమా చెప్పు?

ఆశలకు ఆకలికి ఉన్న
అగాధ వ్యత్యాసాల్ని కనిపెట్టవా ప్రియా…

కన్‌జ్యూమరిజం సాక్షిగా
వంచించబడుతున్నదెవరో
కనుగొనవా ప్రియా…

ప్లీజ్… ప్లీజ్…
ప్లీజ్… ప్లీజ్…

2 స్పందనలు to “డాలర్ ప్రేమల నడుమ…”


  1. 1 anjali 5:58 ఉద. వద్ద జూలై 21, 2007

    అన్నయ్య మీ కవిత చాలాబాగావుంది.


వ్యాఖ్యానించండి




Telugutalli_image
మార్చి 2007
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

మా పాఠకులు