అంతా ఆంగ్లమే

– బెల్లంకొండ రవికాంత్, (పిహెచ్.డి.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

అన్నీ వదిలేశాక
ఇంకా తెలుగుతో పనేముంది.
ఇక్కడ నవ్వినా ఏడ్చినా… అంతా ఆంగ్లమే
మాటలను ఆంగ్లీకరించలేక
భావం గుండె తలపుల్లో నలుగుతూ పెట్టే కేక
స్పష్టంగా వినిపిస్తుంటే
ముసిముసి నవ్వుల మధ్య
యు… నో… అంటూ భుజాలెగరేయడం ఎంతటి విషాదం
*    *    *
పల్లె దీపం చుట్టూ నేను మిణుగురు పురుగులా పరిభ్రమిస్తుంటాను.
పదేపదే నాబాల్యంలోకి తొంగిచూస్తూ
అర్థంగాని భాషలోని సౌందర్యాన్ని
అందంగా తెలుగులోకి చెప్పిన
ఇంగ్లీషు మాస్టార్ని తలుచుకుంటాను
నాకు తెలుగెందుకిష్టమని
మళ్ళీ మళ్లీ నన్ను నేనే ప్రశ్నించుకుంటుంటే
తుషారంతో తడిచిన హృదయం
తడి గీతమై తట్టి లేపుతుంది
*    *    *
నాకెవరన్నా ఆంగ్లం నేర్పండయ్యా…!
నా వాళ్ళ మధ్యే నేను అపరిచితుడనౌతున్నాను
ప్రతిక్షణం భయం తీరాన్ని తాకే అలనౌతున్నాను
నిత్యం ఘనీభవించిన నిశ్శబ్ద నదినౌతున్నాను
తెలుగును కూడా ఆంగ్లంలోనే నేర్చుకుంటున్న
ఈ కొత్త ప్రపంచంలో
రేపటి తెలుగుభాషా ముఖ చిత్రాన్ని ఊహిస్తున్నాను
*    *    *
ఔరా…
దేశభాషలందు తెలుగు లెస్స అని
రాయలెంత భ్రమించాడు
పెద్దనామాత్యా… పెద్ద పండితుడివి గదా
నువ్వైనా చెప్పొద్దూ అంత తొందరపాటు తగదని…!!
భాషా రాజకీయ విమర్శకులారా…
అధికార భాషా సింహాసనంపై కూర్చుని
ఉగాదికొక్క మారు ఉలిక్కిపడి లేచే పీఠాధిపతులారా…
తెలుగారా మీరు చేసిన సేవకు
తెలుగు తల్లి పునీతమైంది
ఇకనైనా మారుమూల మట్టి పలకపై
నాలుగు ఆంగ్ల అక్షరాలను నాటండి
అప్పుడే…
పై చదువుల రెక్కలతో వలసలొచ్చే
పల్లె పక్షులు నిర్భయంగా
ఈ విశ్వవిద్యాలయాలపై వాలతాయి.

 

(విశ్వవిద్యాలయాలలో ఆంగ్లం రాక అవస్థలు పడుతున్న నాలాంటి అందరికి)

3 స్పందనలు to “అంతా ఆంగ్లమే”


  1. 1 pasunoori ravinder 7:17 ఉద. వద్ద మార్చి 24, 2007

    congrats sir its right poem at this time .
    exellent comparisons and metophers is there in your poem.
    continue your angree and seriousness on social issues.
    wish you best of luck

  2. 2 bollojubaba 2:38 సా. వద్ద మే 3, 2008

    ఈ కవితద్వారా తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్లమాధ్యమం లోకి ఒచ్చి ఎంతో భాదపడిన నా కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చావు.
    ప్రపంచీకరణ నేపధ్యంలో జీవన పోరాటమనే సముద్రంలో తేలుతూ ఉండాలంటె బహుసా ఇంగ్లీషు నేర్చుకోక తప్పదేమో? చూద్దాం మీతరం ఎటువంటి పరిష్కారాలు చూపుతుందో?

    http://sahitheeyanam.blogspot.com/

  3. 3 సాయిసాహితి 6:04 సా. వద్ద జూన్ 27, 2008

    నిజమే మనం తెలుగు మాట్లాడితే మనం మన నుండి వేరు పడి ఎక్కడో
    అనాగరిక సమాజంలో ఒంటరి యానం చేసినట్లే…
    ఎంత దుస్థితి? చివరికి ప్రభుత్వాలు కూడా ఆంగ్ల మాధ్య మానికి తలొగ్గక తప్పటం లేదంటే..
    తప్పదు భాషాభిమానులంతా ఏకం కావాలి…భాషను పరిరక్షించు కోవాలి.


వ్యాఖ్యానించండి




Telugutalli_image
మార్చి 2007
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

మా పాఠకులు